Goud Saab : టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు తెలగు తెరకు పరిచయం కానున్నాడు. ప్రభాస్ తమ్ముడు విరాజ్ రాజ్ హీరోగా గౌడ్ సాబ్ (Goud Saab) అనే మూవీ తెరకెక్కబోతుంది. ఈ సినిమాతో ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్.. గణేష్ మాస్టర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రభాస్ కుటుంబం నుంచి వస్తున్న హీరో కావడంతో విరాజ్ రాజ్ నటన ఎలా ఉంటుందోనని ప్రభాస్(prabhas) అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
శ్రీ పాద ఫిలిమ్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా పనులు బుధవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యాయి. ముహూర్తపు సన్నివేశానికి స్టార్ దర్శకుడు సుకుమార్ క్లాప్ కొట్టి టైటిల్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. గణేష్ మాస్టర్ నుంచి కథ విన్నానని, పూర్తిగా నచ్చిందని ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని సుకుమార్ తెలిపాడు. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని ఇందులో మంచి ప్రేమ కథ ఉంటుందని దర్శకుడు తెలిపారు.
ఈ సినిమాతో గీత రచయిత వెంగీ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మల్లీశ్వరి సమర్పణలో శ్రీపాద ఫిలింస్ బ్యానర్‌పై ఎస్ఆర్ కళ్యాణమండపం రాజు, కల్వకోట వెంకట రమణ, కాటారి సాయికృష్ణ కార్తీక్‌లు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో విరాజ్ రాజ్ రోల్ పవర్‌ఫుల్‌గా ఉంటుందని, హీరోగా అతడికి మంచి డెబ్యూ మూవీ అవుతుందని ప్రకటించారు. గౌడ్ సాబ్ మూవీతో కొత్త హీరోయిన్ టాలీవుడ్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. హీరోయిన్ తో పాటు మిగిలిన నటీ నటుల పేర్లను త్వరలోనే అనౌన్స్ చేస్తామని పేర్కొన్నారు.