»Peter Higgs Nobel Laureate Who Discovered The Divine Particle Passes Away
Peter Higgs: దైవ కణం కనుగొన్న నోబెల్ గ్రహీత కన్నుమూత
దైవ కణం సృష్టికర్త, నోబెల్ అవార్డు గ్రహీత, ప్రముఖ శాస్త్రవేత్త పీటర్స్ హిగ్స్ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఏప్రిల్ 8న ఆయన ఇంట్లోనే తుదిశ్వాస విడిచారని ఎడిన్బర్గ్ యూనివర్సిటీ ప్రకటించింది.
Peter Higgs: దైవ కణం సృష్టికర్త, నోబెల్ అవార్డు గ్రహీత, ప్రముఖ శాస్త్రవేత్త పీటర్స్ హిగ్స్ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఏప్రిల్ 8న ఆయన ఇంట్లోనే తుదిశ్వాస విడిచారని ఎడిన్బర్గ్ యూనివర్సిటీ ప్రకటించింది. ఈ యూనివర్సిటీలో పీటర్ హిగ్స్ దాదాపు 50 ఏండ్లు ప్రొఫెసర్గా పనిచేశారు. 1964లో ఆయన కనుగొన్న ద్రవ్యరాశి కణసిద్ధాంతానికి 2013లో నోబెల్ అవార్డు లభించింది. బెల్జియంకు చెందిన మరో భౌతిక శాస్త్రవేత్త ఫ్రాన్కోయిస్ ఎంగ్లర్ట్తో కలిసి సంయుక్తంగా హిగ్స్ నోబెల్ అందుకున్నారు. హిగ్స్ గొప్ప అధ్యాపకుడని, యువ శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాత అని స్కాటిష్ యూనివర్సిటీ పేర్కొంది. హిగ్స్ మహనీయుడని ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పీటర్ మాథిసన్ అన్నారు. అతని దార్శనికత, ఊహా ప్రపంచం మన విజ్ఞానాన్ని సుసంపన్నం చేశాయని, వేలాది మంది శాస్త్రవేత్తలు అతని రచనల నుండి ప్రేరణ పొందారని పేర్కొన్నారు.