Bangkok-Vizag AirAsia Flight : విశాఖ నుంచి మరో అంతర్జాతీయ ఫ్లైట్ సర్వేస్ అందుబాటులోకి వచ్చింది. ఎయిర్ ఏషియా ఈ రూట్లో కొత్త ఇంటర్నేషనల్ ఫ్లైట్‌ని ఏర్పాటు చేసింది. ఈ ఫ్లైట్ ఏప్రిల్ 9వ తేదీ నుంచి సర్వీసుల్ని ప్రారంభించింది. అయితే ఇది రోజూ ఉండదు. వారానికి మూడు రోజులు సర్వీసులు ఉంటాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని తెలుసుకుందాం రండి.
మంగళవారం అంటే ఉగాది రోజు నుంచి ఈ ఎయిర్ ఏషియా(Air Asia) ఫ్లైట్ సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా మొదటి సారి విమానంలోకి వచ్చిన ప్రయాణికులు అందరికీ ఫ్లైట్ దిగేప్పుడు పుష్ప గుచ్చాలు ఇచ్చి వీడ్కోలు పలికింది. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ఈ ఫ్లైట్ ఉంటుంది. ఇది విశాఖపట్టణం నుంచి రాత్రి 10:05కి బ్యాంకాక్‌లో బయలు దేరుతుంది. విశాఖకు 11:20కి చేరుకుంటుంది. తిరిగి రాత్రి 11:50కి బయలుదేరి రాత్రి 2:30గంటలకు బ్యాంకాక్ చేరుకుంటుంది.
ఈ సర్వీసు ద్వారా కేవలం గంటా 25 నిమిషాల్లోనే బ్యాంకాక్ వెళ్లొచ్చు. రావొచ్చు. అలాగే బ్యాంకాక్‌లో 7:50కి బయలుదేరే మరో విమానం( Flight) విశాఖపట్టణంకి రాత్రి 11:20కి చేరుతుంది. ఈ ప్లైట్‌లో మాత్రం 2:40 గంటల ప్రయాణ సమయం ఉంటుంది. ఇదిలా ఉండగా విశాఖపట్టణం నుంచి కౌలాలంపూర్‌కు మరో విమాన సర్వీసును ఎయిర్ ఏషియా ప్రారంభించబోతోంది . ఈ సర్వీసును ఏప్రిల్ 26వ తేదీన ప్రారంభించనుంది. ఇప్పటికే బుకింగ్‌లు ప్రారంభించింది.