»Rashmika Mandanna Shocking Rashmika Escaped From Death Fans Tension
Rashmika Mandanna: షాకింగ్.. చావు నుంచి తప్పించుకున్న రష్మిక.. ఫ్యాన్స్ టెన్షన్!
ఈ హెడ్ లైన్ చూసిన తర్వాత రష్మిక మందన్నకు ఏమైంది? అని టెన్షన్ పడుతున్నారు అభిమానులు. అసలు రష్మిక చావు నుంచి తప్పించుకోవడం ఏంటి? అసలేం జరిగింది? ప్రస్తుతం ఆమె ఎలా ఉంది?
Rashmika Mandanna: ఆ మధ్య డీప్ ఫేక్ వీడియోతో హాట్ టాపిక్ అయింది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. అలాగే అనిమల్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. రణ్‌బీర్ కపూర్‌తో కలిసి రొమాంటిక్ డోస్ గట్టిగా ఇచ్చిన రష్మిక.. ఇప్పుడు చావు నుంచి తప్పించున్నాను అంటూ షాకింగ్ న్యూస్ చెప్పింది. వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్న రష్మికకు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రష్మిక ప్రయాణిస్తున్న ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యిందట. దాంతో రష్మిక కంగారు పడిపోయిందట. అయితే.. అదే ఫ్లైట్‌లో రష్మికతో పాటు మరో హీరోయిన్ శ్రద్ధా దాస్ కూడా ఉందట.
ముంబై నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఫ్లైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తిందట. దాంతో ఫ్లైట్ టేకాఫ్ అయిన 30 నిమిషాల తర్వాత మళ్లీ ముంబైకి తిరిగి వచ్చిందని సమాచారం. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇదే విషయాన్ని రష్మిక పోస్ట్ చేశారు. రష్మిక, శ్రద్ధాదాస్ ఫ్లైట్‌లో కూర్చున్న ఫోటోను షేర్ చేస్తూ.. ఈరోజు మేము చావు నుంచి తప్పించుకున్నాము.. అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కానీ ఈ పోస్ట్ చూసిన తర్వాత రష్మికకు ఏమైందని టెన్షన్ పడిపోయారు ఆమె అభిమానులు. థ్యాంక్ గాడ్.. సేఫ్‌గా ల్యాండ్ అయినందుకు అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఏదేమైనా.. రష్మిక మాత్రం ఫ్యాన్స్‌ను బాగానే టెన్షన్ పెట్టింది. ఇకపోతే.. ఆగష్టు 15న రానున్న పుష్ప2 సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది రష్మిక. ఈ సినిమాతో రష్మిక క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోవడం గ్యారెంటీ.