Google Layoffs: టెక్ దిగ్గజం గూగుల్ మరో దశ తొలగింపులను ప్రారంభించింది. తాజా లేఆఫ్‌లలో భాగంగా ఒకేసారి 1,000 మందిని తొలగించినట్లు సెర్చ్ దిగ్గజం తెలిపింది. ఇంతలో కంపెనీ గూగుల్ హార్డ్‌వేర్, సెంట్రల్ ఇంజనీరింగ్ టీమ్‌లు, గూగుల్ అసిస్టెంట్‌తో సహా అనేక విభాగాలలో సంఖ్యలను తగ్గించింది. తొలగింపుల గురించి ముందస్తు సమాచారం ఇవ్వనందుకు చింతిస్తున్నాం.. ఈ క్లిష్ట నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బాధిత ఉద్యోగులకు గూగుల్ సంస్థ ఈమెయిల్ ద్వారా తెలిపింది.
అంతేకాకుండా, అర్హులైన ఉద్యోగులకు పరిహారం ప్యాకేజీని వర్తింపజేస్తామని Google తెలియజేసింది. ఇతర విభాగాల్లో ఎంపిక చేసిన అవకాశాలకు తీసివేతకు గురైన ఉద్యోగులు తిరిగి దరఖాస్తు చేసుకోచ్చని తెలిపింది. కంపెనీకి తిరిగి వచ్చే అవకాశం లేని ఉద్యోగులు ఏప్రిల్‌లో కంపెనీని విడిచిపెట్టాలి. అలాగే 2023లో భారీ తీసివేతలు విడుదల చేసిన పలు టెక్ కంపెనీలు.. ఈ ఏడాది కూడా అదే ట్రెండ్‌ను కొనసాగిస్తున్నాయి. అయితే, ఈ నెల 15వ తేదీ నాటికి ప్రపంచవ్యాప్తంగా 48 టెక్ కంపెనీలు 7,528 మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయని లే-ఆఫ్ ట్రాకింగ్ వెబ్ సైట్ లే-ఆప్స్.ఎఫ్‌వైఐ తెలిపింది. ఈ ఉద్వాసనలు 2024లో కూడా కఠిన నిర్ణయాలకు దారి తీస్తాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. 2023లో 1150కి పైగా టెక్ కంపెనీలు 2.60 లక్షల మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు ఇచ్చాయి.