Google Andriod New Feature : మొబైల్ ఫోన్లను ఇక చేత్తో నొక్కే పనే లేదు. ముఖ కవళికలతో కమాండ్స్ ఇస్తే చాలు. అదే అర్థం చేసుకుని కావాల్సిన పేజీలను ఓపెన్ చేసేస్తుంది. గూగుల్ త్వరలో కొత్త ఆండ్రాయిడ్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురానుంది. దాని పేరే ‘ప్రాజెక్ట్ గేమ్ ఫేస్’. ఆండ్రాయిడ్ వినియోగదారులకు దీన్ని త్వరలో అందుబాటులోకి తెస్తామని గూగుల్ చెబుతోంది.
మనం ప్రస్తుతం ఫోన్ చేసుకోవాలన్నా, ఫోన్ ఎత్తాలన్నా చేతితో టచ్ చేసి ఆ పని చేస్తాం. అయితే గూగుల్ కొత్తగా తెస్తున్న ఈ ఏఐ టెక్నాలజీ ఫీచర్ ద్వారా ఇక చేతితో టచ్ చేయాల్సిన పనే లేదు. ముఖ కవళికలు, తల, పెదాలను కదపడం ద్వారా సంజ్ఞలు చేస్తే సరిపోతుంది. ఫోన్ మనం చెప్పే దాన్ని అర్థం చేసుకుని దాని పని అది చేసేస్తుంది. ఫోన్ కేమెరాకు ఏఐ టెక్నాలజీని అనుసంధానం చేయడం ద్వారా ఈ ఫీచర్ పని చేస్తుంది. మన కదలికలను ట్రాక్ చేసి అర్థం చేసుకుంటుంది.
మీకు తెలుసా? గూగుల్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్లను చదివేందుకు వీలుగా ఓ ఫీచర్‌ని సైతం గతంలో తీసుకొచ్చింది. సాధారణంగా మనం డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ చదవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అర్థం కాదు. అయితే ఆ ప్రిస్క్రిప్షన్ని గూగుల్ లెన్స్‌తో ఫోటో తీయవచ్చు. అలా చేయడం ద్వారా అందులోని మందుల వివరాలను సెర్చ్‌లో చూపిస్తుంది. అయితే ఈ ఫీచర్‌ని మరింత మెరుగుపరిచే పనిలో ఉన్నామని గూగుల్ తెలిపింది. అప్పుడే దీని ద్వారా వచ్చే అన్ని మందులను 100 శాతం నమ్మడానికి లేదని తెలిపింది. మెడికల్ రికార్డులను డిజిటలైజ్ చేయడంతో పాటు దీన్ని మెరుగుపరిచేందుకు తాము ఫార్మాసిస్టులతో కలిసి పని చేస్తున్నట్లు వెల్లడించింది.