»Latest Technology To Check Spam Calls Truecaller With Ai
Spam calls: స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టనున్న సరికొత్త టెక్నాలజీ
స్పామ్ కాల్స్ విసిగిపోతున్నారా? గుర్తు తెలియని నెంబర్లనుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయా? ఆర్థిక సాయం కావాలంటూ మీ ఫ్రెండ్‌లా మాట్లాడుతున్నారా? ఇకపై వీటన్నింటికి చెక్ పెట్టబోతోంది ట్రూకాలర్. అదేలానో చూడండి.
Latest technology to check spam calls.. Truecaller with AI
Spam calls: ఈ మధ్య స్పామ్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. తెలీని నంబర్ నుంచి ఫోన్ వస్తుంది. లిఫ్ట్ చేయగానే అవతలి వ్యక్తి మీ స్నేహితుడి వాయిస్‌తో కంగారుగా మాట్లాడుతాడు. తాను ప్రమాదంలో ఉన్నట్లు అర్జెంట్‌గా డబ్బులు కావాలని అడుగుతారు. ఆ మాటలు నమ్మి ఏమి ఆలోచించకుండా వెంటనే డబ్బులు వేస్తుంటారు. ఇది ఒక రకమైన స్కామ్ అని ఆ తరువాత తెలుసుకొని బాధపడుతారు. దీన్ని ఆసరాగా తీసుకొని సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ఏఐ సాయంతో వాయిస్‌లను మారుస్తున్నారు. సాధారణంగా దాన్ని గుర్తించడం చాలా కష్టం. తాజాగా దీని నుంచి బయటపడేందుకు ట్రూకాలర్ ఓ సరికొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. దీన్ని సైతం ఏఐతోనే గుర్తించేలా ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.
ఏదైనా కాల్ వచ్చినప్పుడు అవతల మాట్లాడే వాయిస్ ఏఐతో జనరేట్ చేసినదా? లేదా అని క్షణాల్లో తెలిసిపోతుంది. ట్రూకాలర్ ఈ ఫీచర్‌ను డెవలప్ చేసింది. దానికి కోసం ఈ వాయిస్‌ను ముందు కొన్ని సెకన్లు రికార్డు చేస్తుంది. ఆ తరువాత అది నిజమా కాదా అని చెప్తుంది. దీనికోసం ట్రూకాలర్‌ను డిఫాల్ట్ కాలర్ యాప్‌గా సెట్ చేసుకోవాలి. దీని తరువాత స్పామ్ కాల్స్ వచ్చినప్పుడు స్టార్ట్ డిటెక్షన్‌పై క్లిక్ చేస్తే కాల్‌ను రికార్డు చేసికొన్ని క్షణాల్లో దాన్ని అనలైజ్ చేస్తుంది. వెంటనే ఫేక్ అయినా, జన్యూన్ అయినా నోటిఫికేషన్ రూపంలో తెలియజేస్తుంది. దీన్ని అమెరికాలోని ఆండ్రాయిడ్ ప్రీమియం యూజర్లకు అందుబాటులో ఉంది. ఇది విజవంతం అవడంతో వచ్చే నెల నుంచి భారత్‌లో తీసుకొస్తున్నట్లు ట్రూకాలర్ కంపెనీ తెలపింది.