»Jalna To Mumbai Vande Bharat Express Train Malfunction In Brake System
VandeBharat :వందే భారత్ ట్రైన్ బ్రేక్ సిస్టమ్ ఫెయిల్.. భయాందోళనలో ప్రయాణికులు
మహారాష్ట్రలోని జల్నా నుంచి ముంబైకి వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు బ్రేక్ సిస్టమ్‌లో మంగళవారం ఉదయం లోపం ఏర్పడింది. దీంతో రైలులో ప్రయాణించే ప్రయాణికులు దాదాపు 30 నిమిషాలు ఆలస్యమయ్యారు.
VandeBharat : మహారాష్ట్రలోని జల్నా నుంచి ముంబైకి వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు బ్రేక్ సిస్టమ్‌లో మంగళవారం ఉదయం లోపం ఏర్పడింది. దీంతో రైలులో ప్రయాణించే ప్రయాణికులు దాదాపు 30 నిమిషాలు ఆలస్యమయ్యారు. పొరుగున ఉన్న థానే జిల్లాలోని అసన్సోల్ స్టేషన్లో రైలు ఆగిపోయిందని, అక్కడ సాంకేతిక లోపాన్ని సరిచేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. దీని తర్వాత రైలు ఈరోజు ఉదయం 11.25 గంటలకు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఉదయం 5.05 గంటలకు జల్నాలో బయలుదేరిన రైలు 11.55 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్‌కు చేరుకుంది. దాదర్, థానే, కళ్యాణ్ జంక్షన్, నాసిక్ రోడ్, మన్మాడ్ జంక్షన్, ఔరంగాబాద్ స్టేషన్ వద్ద ఆగింది.
సెంట్రల్ రైల్వే అధికారి మాట్లాడుతూ, ‘ఉదయం 11 గంటల ప్రాంతంలో రైలు బ్రేక్ సిస్టమ్‌లో లోపం ఏర్పడింది. సాంకేతిక లోపాన్ని పరిష్కరించిన అనంతరం ఉదయం 11.25 గంటల ప్రాంతంలో ముంబైకి బయలుదేరింది. వందేభారత్ రైలు బ్రేక్ సిస్టమ్‌లో లోపం తలెత్తడంతో ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారని చెబుతున్నారు. బ్రేకింగ్ సిస్టం ఫెయిల్ కావడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. కానీ అరగంటలో ఈ సమస్య పరిష్కరించబడింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
వందే భారత్ రైలు ఢీకొనడంతో ఎద్దు మృతి
అంతకుముందు, శనివారం సాయంత్రం మహారాష్ట్రలోని లాతూర్ స్టేషన్ దాటిన తర్వాత CSMT-జల్నా వందే భారత్ రైలు ఎద్దును ఢీకొట్టింది. ప్రమాదంలో ఎద్దు మృతి చెందినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు ఇంజిన్‌కు పెద్దగా నష్టం జరగలేదు. ప్రమాదంలో ప్రయాణికులెవరూ గాయపడలేదు. లాతూర్, పోతుల్ స్టేషన్ల మధ్య సాయంత్రం 6.35 గంటలకు ప్రమాదం సంభవించింది. దీని కారణంగా సెమీ-హై స్పీడ్ రైలు 35 నిమిషాల పాటు నిలిచిపోయిందని అధికారి తెలిపారు.