Vandebharat : వందే భారత్ రైలులో టెక్నికల్ ప్రాబ్లమ్.. క్లోజ్ అయిన గేట్లు
భారతీయ రైల్వేలో అత్యంత ఆధునిక రైలుగా పరిగణించబడే వందే భారత్‌లో సాంకేతిక లోపం కనిపించింది. దాంతో వందేభారత్ రైలు సూరత్ రైల్వే స్టేషన్లో చాలా సేపు నిలిచిపోయింది .
Vandebharat : భారతీయ రైల్వేలో అత్యంత ఆధునిక రైలుగా పరిగణించబడే వందే భారత్‌లో సాంకేతిక లోపం కనిపించింది. దాంతో వందేభారత్ రైలు సూరత్ రైల్వే స్టేషన్లో చాలా సేపు నిలిచిపోయింది . దాదాపు గంటకు పైగా దాని గేట్లు కూడా ఓపెన్ కాలేదు. సాంకేతిక బృందం టెక్నికల్ ప్రాబ్లమ్ ని సరిచేసింది. ఈ సమయంలో మొత్తం గంట వృథా అయింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రారంభమైన వందే భారత్ చాలా కాలం పాటు ఇక్కడ నిలిచిపోయింది. సమాచారం ప్రకారం వందేభారత్ రైలు అహ్మదాబాద్ నుంచి ముంబైకి వెళ్తోంది. ఇంతలో అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తడంతో రైలు సూరత్ రైల్వే స్టేషన్లో నిలిచిపోయింది. ఈ సమయంలో రైలు గేటు తెరవకపోవడంతో కంట్రోల్ రూంకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక విభాగం ఉద్యోగులను వెంటనే అక్కడి నుంచి పంపించారు. సాంకేతిక విభాగం ఉద్యోగులు వెంటనే లోపాన్ని సరిచేసే పనిని ప్రారంభించారు. ఉదయం 8.20 గంటలకు రైలు సూరత్‌కు చేరుకుందని చెబుతున్నారు. ఆ తర్వాత రైలు మరమ్మతులకు గంట సమయం పట్టింది.
ఇంతకుముందు కూడా వందేభారత్ రైలులో సాంకేతిక లోపాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. ఈసారి కూడా ఇదే చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వందేభారత్ రైలు తలుపులు తెరుచుకునే వరకు అందులో కూర్చున్న ప్రయాణికుల ఊపిరి ఆగినంత పనైంది. అందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రైలు డోర్లు ఓపెన్ కాగానే ఊపిరి పీల్చుకున్నారు, ప్రయాణికులు సుమారు గంటపాటు రైలులోనే ఉండిపోయారు. ప్రస్తుతం, భారతీయ రైల్వేలలో అత్యంత ఆధునిక రైలు వందే భారత్. ఇది లగ్జరీ క్లాస్ ను ఇష్టపడే వ్యక్తులకు మొదటి ఎంపికగా మిగిలిపోయింది. రైలు సమయం, హైటెక్ సౌకర్యాల కారణంగా.. ఈ రైలు మరింత ప్రత్యేకమైనది. రైలు లోపల అనేక ఫీచర్లు ఆటోమేటిక్‌గా ఉంటాయి. ఇవి యంత్రాల ద్వారా నిర్వహించబడతాయి. ఈ రైలు తలుపులు కూడా ఆటోమేటిక్‌గా ఉంటాయి, ఇవి స్టేషన్‌కు చేరుకున్న తర్వాత తెరవబడతాయి. ప్రయాణికుల భద్రత కోసం స్టేషన్ నుండి బయలుదేరే ముందు మూసివేయబడతాయి.