»A Huge Accident In Kenya 40 People Died Due To The Collapse Of The Dam
Kenya: కెన్యాలో భారీ ప్రమాదం.. డ్యామ్ కూలీ 40 మంది దుర్మరణం
ఆఫ్రికా దేశం కెన్యాలోని ఓ డ్యామ్ కూలిపోవడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. ఈ దుర్ఘటనలో దాదాపు 40 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి డ్యామ్ ధ్వంసం అయిందని ఈ ప్రమాదంలో మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
A huge accident in Kenya.. 40 people died due to the collapse of the dam
Kenya: చీకటి ఖండంగా పిలిచే ఆఫ్రికాలో ఘోర ప్రమాదం చోటుచేసుంది. కెన్యా (Kenya)లో ఓ డ్యామ్ కూలి భారీగా ప్రాణనష్టం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 40 మంది వరకు మృతి చెందారని అధికారులు ధృవికరించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా కెన్యాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రిఫ్ట్ వ్యాలీకి చెందిన మాయి మహియు పట్టణంలోని కిజాబె డ్యామ్ కూలిపోయింది. వరద పెరగడంతో డ్యామ్ గోడలు కొట్టుకుపోయాయి. దాంతో వరద ఒక్కసారిగా లోతట్టు ప్రాంతాలకు ప్రవహించింది. దాంతో పలు ఇల్లు ధ్వంసం అయ్యాయి. ఓ రహదారి సైతం కొట్టుకుపోయింది. అనేక మంది గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఇప్పటికే 40 మంది మృతదేహాలు లభించినట్లు అధికారులు వెల్లడించారు.
ఇంకా చాలా బురదలో చిక్కునే అవకాశం ఉందని పేర్కొన్నారు. వారిని బయటకు తీసేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నాయని స్థానిక యంత్రాంగం తెలిపింది. ఎల్నినో వల్లే సాధారణం కంటే అతి భారీ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. కెన్యాలో ప్రభుత్వకార్యలయాలు, విద్యాలయాలు మూసివేశారు. దీంతో మధ్యంతర సెలవులు కూడా పొడిగించే యోచనలో ప్రభుత్వం ఆలోచిస్తుంది. పొరుగుదేశం టాంజానియాలో సైతం వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడడంతో ఆ దేశంలో ఇప్పటికే 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.