MDK: జిల్లాలో పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా విద్యార్థిని, విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఇవాళ పాపన్నపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరీక్షించి, సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు.