KDP: సిద్ధవటం మండలం భాకరాపేట గ్రామ సమీపంలో ఉన్న శ్రీ పరమాత్మ తపోవన వృద్ధాశ్రమంలోని వృద్ధులకు MPDO పులి రాంసింగ్ శనివారం అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వృద్ధులకు అన్న వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు.