రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో కలిపి 20 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లండ్తో విశాఖలో జరుగుతున్న వన్డేలో 27 రన్స్ చేయడం ద్వారా ఈ రికార్డ్ సాధించాడు. రోహిత్ వన్డేల్లో 11,468, టెస్టుల్లో 4,301, T20ల్లో 4,231 పరుగులు చేశాడు. దీంతో భారత్ తరఫున ఈ రికార్డు సాధించిన సచిన్(34,357), కోహ్లీ(27,808), ద్రవిడ్(24,064) తర్వాతి స్థానంలో నిలిచాడు.