MBNR: మహబూబ్ నగర్ నుంచి నాగర్ కర్నూల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును క్రిస్టియన్పల్లి వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ క్రాస్ చేస్తూ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. అదృష్టవశాత్తు ప్రయాణికులెవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.