WNP: మదనాపూర్ మండలం అజ్జకొల్లు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ జడ్పీటీసీ మహానంది సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొత్తగా చేరిన వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. చేరిన వారిలో రాములు గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, ఎల్లన్న, వారి అనుచరులు ఉన్నారు.