కృష్ణా: ఆరోగ్యకర జీవనం కోసం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ వారానికి ఒక రోజైనా సైకిల్ వాడి వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం నివారించి పర్యావరణాన్ని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ బాలాజీ శనివారం ప్రజలకు పిలుపునిచ్చారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్ కార్యాలయానికి కలెక్టర్ సైకిల్‌పై వచ్చారు. ఆయన వెంట వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు.