KMM: రఘునాథపాలెం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సురేష్ బాబు ఇటీవల రన్నర్స్ సోసైటీ ఆధ్వర్యంలో HYDలో జరిగిన రన్నింగ్ పోటీలో పాల్గొని విజయం సాధించారు. మొత్తం 400 మీటర్స్ ట్రాక్‌పైన 254 రౌండ్స్ (101.6 కిలోమీటర్లు) రన్ పూర్తి చేసి 3వ స్థానంలో నిలిచారు. ఈ నేపథ్యంలో శనివారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కానిస్టేబుల్‌ను అభినందించారు.