కోనసీమ: రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద విద్యార్థులు నష్ట పోతారని మున్సిపల్ ఛైర్మన్ దుర్గారాణి పేర్కొన్నారు. మండపేట పట్టణం ఏడిద రోడ్డు, వేగుళ్ల సూర్యారావు జూనియర్ కళాశాల ప్రాంతం, కలువపువ్వు సెంటర్ ముఖ్య కూడళ్లలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణి శనివారం నిర్వహించారు.