SKLM: టెక్కలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం సీఐ విజయ్ కుమార్ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కేసులో బెనియా జగబంధుని మెలియాపుట్టిలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అతని వద్ద నుంచి 78.205 గ్రాముల బంగారం, 38 గ్రాముల వెండి, రూ.10వేలు నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామన్నారు.