RR: షాద్‌నగర్ పట్టణ సీనియర్ మహిళా న్యాయవాది సబియా సుల్తానాను అబిడ్స్‌లోని తెలంగాణ సారసత్వ పరిషత్ ఆడిటోరియంలో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం మెమొంటోను అందజేశారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కష్టానికి తగ్గ ఫలితం దక్కినప్పుడు ఆనందంగా ఉంటుందని, మొట్టమొదటి మైనారిటీ మహిళా న్యాయవాదిని కావడం చాలా సంతోషంగా ఉందన్నారు.