KRNL: పెద్దకడబురు మండలం హనుమాపురం గ్రామంలో ఎస్సై నిరంజన్ రెడ్డి నేషనల్ హైవే-167పై వాహనాల తనిఖీ చేపట్టారు. హెల్మెట్ ధరించని 39 మంది వాహనదారులకు ఒక్కొక్కరికి రూ. 1,035 జరిమానా విధించినట్లు తెలిపారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు. అలాగే, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఈ సందర్భంగా అవగాహన కల్పించామన్నారు.