ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల కోర్టుల పరిధిలోని పెండింగ్ కేసులపై హైకోర్టు జడ్జి EV. వేణుగోపాల్ సమీక్ష జరిపారు. ములుగులోని R&B అతిథి గృహంలో మూడు జిల్లాల ప్రధాన న్యాయమూర్తులతో న్యాయ పరిపాలన విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా జడ్జి సూర్య చంద్రకళ, భూపాలపల్లి జిల్లా జడ్జి సిహెచ్. రమేష్ బాబు, పాల్గొన్నారు.