WG: నూతన టీచర్ల జీతాల విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలని STU జిల్లా ప్రధాన కార్యదర్శి పెన్మెత్స సాయి వర్మ కోరారు. ఈ మేరకు ఆయన భీమవరం ఎస్.టీ.వో. ఆఫీస్లో మెమోరాండం సమర్పించారు. డీఎస్సీ 2025 నూతన టీచర్ల జీతాలు చేసే క్రమంలో వచ్చే లోపాలను ఎప్పటికప్పుడు పరిష్కరించి, వారి జీతాలు సక్రమంగా వచ్చే విధంగా చూడాలని కార్యాలయం సిబ్బందికి ఆయన విజ్ఞప్తి చేశారు.