NLR: సంగంలో శనివారం రాజ్యాంగ నిర్మాత బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత తిరుమలేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.