SRPT: పత్తి కూలీలతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పి ఈరోజు సాయంత్రం బోల్తా పడటంతో 15 మంది గాయపడ్డారు. చింతలపాలెం గ్రామానికి చెందిన కూలీలు పీ ఆర్ సిమెంట్స్ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. గ్రామస్తులు హుటాహుటిన గాయపడిన వారిని హుజూర్ నగర్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం సూర్యాపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు.