ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో జరుగుతున్నందున, చివరి దశ ఎన్నికలు పూర్తయ్యే వరకూ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లో ఉంటుందని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. విజయోత్సవ ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, ప్రకటనలు, అభివృద్ధి హామీలు వంటి చర్యలను తక్షణమే నిరోధించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.