KMM: బోనకల్ మండలంలోని రాపల్లిలో ఏసీపీ సాంబరాజు ఆధ్వర్యంలో శనివారం ఎన్నికల అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజలు తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. డబ్బు, మద్యం లేదా ఇతర ప్రలోభాలకు లొంగి ఓటు వేస్తే అది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుందని ఆయన స్పష్టంగా ప్రజలకు తెలియజేశారు.