PDPL: పెద్దపల్లి పట్టణంలోని కూనారం ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న ట్రాన్స్ ఫార్మర్ను వెనుక భాగానికి మార్చే పనుల కారణంగా రేపు ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అదనపు సహాయ ఇంజనీర్ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉదయనగర్, జకోటియా కాంప్లెక్స్, కాలేజీ కాంప్లెక్స్, జకోటియా పెట్రోల్ బంక్ పరిసర ప్రాంతాల్లో నిలిపివేస్తామన్నారు.