ADB: అటవీ ప్రాంతంతో పాటు టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని అడిషనల్ పీసీసీఎఫ్ రత్నాకర్ జవరి అన్నారు. ఆదిలాబాద్లో అటవీ ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కవ్వాల్ టైగర్ ఫారెస్ట్ పరిధిలో టైగర్ ఏర్పాటుకు పలు గ్రామాలను గుర్తించామన్నారు. పులుల సంరక్షణతో పాటు ఎకో టూరిజాన్ని పెంచేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.