MDK: రామాయంపేట పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.