VZM: జిల్లాలో పెన్షనుదారులు, కుటుంబ పెన్షనుదారులు 2026 సంవత్సరానికి లైఫ్ సర్టిఫికేట్ను తప్పనిసరిగా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28లోపు సమర్పించాల్సి ఉంటుందని జిల్లా ఖజానా అధికారి నాగమహేష్ శనివారం తెలిపారు. నవంబర్, డిసెంబర్ 2025లో సమర్పించిన లైఫ్ సర్టిఫికేట్లు 2026కి చెల్లవని, ఇప్పటికే సమర్పించినవారు మళ్లీ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.