KMM: డిజిటల్‌గా అరెస్ట్ చేస్తామనే సైబర్ నేరగాళ్ళ మాటలు నమ్మి మోసపోవద్దని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా వైరా ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. మీరు ఏదైనా మోసానికి గురైనట్లు భావిస్తే, వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.