MHBD: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఇవాళ హమాలీ కూలీల సమావేశం బాలు అధ్యక్షతన నిర్వహించారు. సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరికుంట్ల నాగన్న మాట్లాడుతూ.. దశాబ్దాలుగా మార్కెట్లో శ్రమిస్తున్న హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్లు దాటిన హమాలీలకు నెలకు రూ.5000 పెన్షన్ కల్పించాలని కోరారు.