BDK: పాల్వంచలో గుమ్మడి నరసయ్య బయోపిక్ ప్రారంభోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ముఖ్యఅతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సాధారణ జీవితం గడుపుతున్న నరసయ్య జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం తెలంగాణ బిడ్డలకు గర్వకారణమని అన్నారు.