W.G: ఆకివీడు మండలం కుప్పనపూడి శివారు తాళ్లకోడు ఎన్టీఆర్ కాలనీలో నివాస ఉంటున్న పేద ప్రజలను ఆకివీడు నగర పంచాయతీకి అనుసంధానం చేస్తూ నిర్ణయం తీసుకోవాలని CPM జిల్లా కార్యదర్శి JNV గోపాలం డిమాండ్ చేశారు. ఆకివీడులో ఏరియా కమిటీ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. కాలనీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. కాలనీ వాసులను ఆకివీడుకు చెందిన వారిగా గుర్తించాలన్నారు.