TG: దేవరకొండ గడ్డ కాంగ్రెస్ అడ్డా అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఓటు అనే ఆయుధంతో గడీలను కుప్పకూల్చారని అన్నారు. ఈ ప్రాంత గాలి, నీటికి కూడా పోరాట పటిమ ఉందన్నారు. రజాకార్లను తరిమికొట్టిన ప్రాంతం నల్గొండ అని చెప్పారు. అలాగే.. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండుకళ్లుగా భావించినట్లు సీఎం రేవంత్ వెల్లడించారు.