WGL: రాయపర్తి మండలం పానీష్ తండాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు భూక్యా బిక్షపతి, బానోత్ రవి, సంజీవ్ తమ అనుచరులతో కలిసి ఇవాళ మాజీ మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో BRS పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. డిసెంబర్ 11న జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో BRS పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకొని సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.