హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డ్ చేరింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరి వన్డేలో రోహిత్ 5 పరుగులు చేసి.. SENA దేశాలపై వన్డేల్లో 5 వేల రన్స్ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఓపెనర్‌గా SENA దేశాలపై ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు సచిన్ (7116 పరుగులు) మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నాడు.