AP: రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థ మెరుగుదలపై తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ‘రైతులకు సకాలంలో రెండు పంటలకు నీరు అందిస్తున్నాం. గత ఐదేళ్ల పాలనలో వైసీపీ ఇరిగేషన్ వ్యవస్థకు తాళం వేసింది. ప్రాజెక్టుల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేేదు. వంశాధార, నాగావళి నదుల అనుసంధానం పనులను.. 70 శాతం పూర్తి చేశాం’ అని పేర్కొన్నారు.