AP: ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది సుమారు 10,060 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ కసరత్తు పూర్తి చేసింది. ఇందులో టీచర్, పోలీస్, గ్రూప్స్, యూనివర్సిటీ పోస్టులు ప్రధానంగా ఉన్నాయి. సీఎం చంద్రబాబుతో చర్చించిన తర్వాత ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే దానిపై స్పష్టత రానుంది.