కృష్ణా: వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో చాలా మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని రామవరప్పాడు ట్రాఫిక్ సీఐ రమేష్ కుమార్ అన్నారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడపటం వలన ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని అన్నారు. ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహించి హెల్మెట్‌పై అవగాహన నిర్వహించారు.