విజయ్ దళపతి తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ‘సిగ్మా’ విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయినప్పటికీ, విజయ్ రాజకీయ పార్టీ పనులు, వ్యక్తిగత పరిణామాల వల్ల మేకర్స్ వెనక్కి తగ్గారట. ఎన్నికల సమయంలో రాజకీయ ప్రశ్నలు జేసన్ను ఇబ్బంది పెడతాయని భావించి, అసెంబ్లీ ఎన్నికల తర్వాతే విడుదల చేయాలని చూస్తున్నారట.