IPL 2026 కోసం KKR ముస్తాఫిజుర్ రెహ్మాన్ స్థానంలో బ్లెసింగ్ ముజర్బానీని తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకోసం PSL కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్న అతనిపై లీగల్ చర్యలు తీసుకునేందుకు PCB సిద్ధమైనట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. కాగా గతేడాది కార్బిన్ బాష్ కూడా ముంబై ఇండియన్స్‌లో చేరేందుకు PSL-పెష్వార్ జల్మీ నుంచి వైదొలిగాడు. దీంతో PCB అతనిపై ఏడాది పాటు నిషేధం విధించింది.