అనంతపురానికి చెందిన ఓ యువకుడిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. టెలిగ్రామ్ గ్రూపులో పరిచయమైన ఓ యువతి, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని నమ్మబలికింది. ఆమె మాటలు నమ్మి సదరు యువకుడు రూ.18,57,600 నగదు బదిలీ చేసి మోసపోయాడు. నెలలు గడిచినా డబ్బులు తిరిగి రాకపోవడంతో రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.