VKB: కోట్పల్లి మండలంలోని అన్నసాగర్ నుంచి సల్బత్తాపూర్ వెళ్లే రహదారి పూర్తిగా అధ్వానంగా మారింది. రోడ్డుపై మోకాళ్ల లోతు గుంతలు పడటంతో అటుగా వెళ్లే రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం వస్తే ఈ మార్గంలో ప్రయాణం ‘కత్తి మీద సామే’ అని గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే నూతన రోడ్డు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.