AKP: గొలుగొండ మండలం కృష్ణదేవి పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణ కోసం 14 నుంచి 15 సంవత్సరాల బాలికలకు HPV టీకా కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ గాయత్రి 26 బాలికలకు టీకాలు వేశారు. టీకా ద్వారా బాలికలలో క్యాన్సర్ రిస్క్ తగ్గించడం లక్ష్యంగా ఉంటుందని ఆమె చెప్పారు.