ELR: జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉంగుటూరు క్యాంపు కార్యాలయంలో శనివారం పార్టీ జెండాను ఉంగుటూరు MLA ధర్మరాజు ఎగరవేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధి, ప్రజల అభ్యున్నతి కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. కార్యక్రమంలో ఉంగుటూరు నియోజవర్గ జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.