అన్నమయ్య: వెలిగల్లు ప్రాజెక్టు నుంచి కాల్వల ద్వారా రైతులకు సాగునీరు అందించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ కార్యదర్శి విశ్వనాథ్ డిమాండ్ చేశారు. శనివారం గాలివీడు మండలం గోరన్ చెరువు గ్రామంలో కరపత్రాలు పంపిణీ చేశారు. బోర్లు వేసినా నీరు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సాగునీరు కోసం రైతులు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.