WNP: రైతులు కష్టపడి పండించిన ధాన్యంపై రైస్ మిల్లుల వద్ద ఏ విధమైన అక్రమాలు, నిర్లక్ష్యం జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి హెచ్చరించారు. శనివారం పోలీస్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై సీఎంఆర్ కేసులపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా విచారించి త్వరగా పూర్తి చేయాలని సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశించారు.