SRD: బొల్లారం డివిజన్లో పేద ముస్లింలకు ఇశాళ రంజాన్ తోఫాలు పంపిణీ చేశారు. శనివారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రంజాన్ పండుగను పేద ముస్లింలు ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తోఫాలు అందజేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జయపాల్ రెడ్డి, మహేందర్ రెడ్డి ఉన్నారు.